Saturday, March 5, 2011

సుస్వాగతమ్


అందరికీ నమస్కారం

ఈ ' వినయ్ ' అనే వినయ దత్త మా బాబే ! 

ఈరోజుకి అతడు పుట్టి సరిగ్గా పదకొండేళ్లయింది. 

తిథుల ప్రకారం ( 2000 వ సంవత్సరం ) ఆదివారం - అమావాస్య - అర్థరాత్రి పుట్టడం వల్లనేమో కొంత విలక్షణంగా వుంటాడు. ఎప్పుడూ ఉత్సాహంగా వుంటాడు. 



ఒక సంవత్సరం కాలం నుంచి నేను ' కూడలి ' ని తరచుగా సందర్శిస్తున్నాను. ఇది గమనించిన వినయదత్తా ' ఎప్పుడూ కూడలేనా ? ఎప్పుడూ తెలుగు బ్లాగులేనా ? ' అనేవాడు. అప్పుడు నేను ' కథామంజరి ' తదితర బ్లాగుల్లోని కథలు చదివి వినిపించాను. 

' శిరాకదంబం ' లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టపా ద్వారా ఆ గాన గంధర్వుడికి శుభాకాంక్షలు అందిస్తూ మా బాబు పేరును కూడా చేర్చాను. బాలు తాతగారంటే వాడికీ ఇష్టమే మరి. మా శుభాకాంక్షలకి స్పందించిన రావుగారు ప్రత్యేకంగా రెండు మాటలు మా బాబుని ఉద్దేశించి రాశారు. అప్పటికే కథలకి ఆకర్షితుడయ్యాడు కాబట్టి ' అమ్మా ! నేను కూడా బ్లాగు రాస్తాను ' అన్నాడు. అడిగిందే తడవుగా ప్రయత్నించినా ఎందుకో మరి మొదలు పెట్టడానికే  కొంత ఆలస్యమైంది. మొత్తానికి అతడి  ఆలోచనకి, ఊహకి ఒక రూపం ఇవ్వగలుగుతున్నందుకు సంతోషంగా వుంది. 

తెలుగు చదవడం, రాయడం రాకపోయినా అతని టపాలోని మాటలు అతనివే ! పదాలు మాత్రమే నావి. ఎప్పుడో ఒకసారి మీ ముందుకు వచ్చే వినయ దత్త ను ఆశీర్వదించగలరు. ఇదే వేదికను ఉపయోగించుకుని నేనూ కొన్ని టపాలు ప్రచురించగలను.

శుభాభినందనలతో............ 

మాధురి 
ప్రాణిక్ హీలర్ 
కాంట్రిబ్యూటర్, ఈనాడు 
చెన్నై

13 comments:

  1. వినయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆశీర్వాదాలు. ముందు ముందు రాతలు కూడా అతనివే కావాలి మరి. చదివించండి, రాయించండి. ఇది మీ బాధ్యత..

    ReplyDelete
  2. వినయ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు
    బ్లాగ్లోకానికి సాదర స్వాగతం. త్వరలో స్వంతం గా తెలుగులో బ్లాగుతాడని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  3. వినయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు .

    ReplyDelete
  4. వినయదత్తాయ చిరాయురస్తు సద్విద్యా೭స్తు.

    ReplyDelete
  5. బాలవాక్కు బ్లాగిది. వినయ్‌కు ఆశిస్సులు.

    ReplyDelete
  6. TO,
    Jyothi garu, Sankar garu, Maala Kumar garu, Raghava garu, CBRao garu,


    thank you all very much. Raghava garu, thank you for blessing in sanskrit. my second language in school is sanskrit.


    VINAY DATTA

    ReplyDelete
  7. వినయ్ కు నా శుభాకాంక్షలు. ఆశీర్వాదాలు.

    ReplyDelete
  8. చిరంజీవి వినయ్ దత్తా!
    ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో ఎన్నో చేసుకోవాలని మనసారా
    కోరుకుంటున్నాను...బ్లాగుద్వారా మంచి మంచి కబుర్లు చెప్పు...బై

    ReplyDelete
  9. వినయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

    www.arajachandra.blogspot.com

    ReplyDelete
  10. వినయదత్తా !
    మాధురి గారూ !

    శుభాభినందనలు. మీ దగ్గర్నుంచి మంచి టపాలను ఆశిస్తూ .... ' వినయ్ ' విజయవంతం కావాలని కోరుకుంటూ......

    ReplyDelete
  11. thank you
    1.jogarao garu
    2.hanumantarao garu
    3.rajachandra garu
    4.rao garu

    ReplyDelete
  12. వినయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆశీర్వాదాలు. మీ బాబును ఆ దేవుడు చల్లగా చూడాలని, తను మంచి విద్యాబుద్ధులతో పెరిగి పెద్దవాడవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ... శోభ

    ReplyDelete
  13. శోభ గారు, ధన్యవాదాలు.
    మాధురి.

    ReplyDelete