Thursday, December 29, 2011

బాల విద్వాంసుల విన్యాసం.......

చెన్నైలో జరుగుతున్న మార్గశిర సంగీతోత్సవాల్లో భాగంగా బాల విద్వాంసుల విన్యాసం జరిగింది. అందులో భాగంగా మా అబ్బాయి చి. వినయ్ ( ఈ బ్లాగు సహ నిర్వాహకుడు ) మృదంగ వాయిద్యంతో, మా మేనకోడలు ( అన్నగారి అమ్మాయి ) చి. శ్రీముఖి హిందుస్తానీ గాత్రంతో అలరించారు.

ఆ వార్త ఈరోజు ఈనాడు చెన్నై ఎడిషన్ లో.............
మీరూ చదివి ఆ చిన్నారులను అశీర్వదిస్తారని ఆశిస్తూ....

- మాధురి 




Tuesday, August 23, 2011

పిల్లల కోసం

 10 సంవత్సరాల పిల్లలకి హృదయ సంబంధ వ్యాదులకి  శస్త్రచికిత్స అవసరమైతే కింది నంబర్లను సంప్రదించవచ్చు . శస్త్రచిక్కిత్స ఉచితంగా చేస్తారని విన్నాను .          
+91-9793273183 (India),+1-(347)627-0183 (USA),+44-02032390183 (UK).

Friday, June 3, 2011

గొల్లపూడివారి ఆంగ్ల వ్యాసం

 గొల్లపూడివారి వ్యాసం చదవాలన్న ఆసక్తి ఉన్నవారు ఆంగ్లంలోని వ్యాసం కోసం ఇక్కడ చూడవచ్చు.


Eolss Article-print Out

గొల్లపూడికి.... గౌరవం

గౌరవనీయులైన డాక్టర్ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి యునెస్కో వారి అంతర్జాతీయ సంపాదక మండలిలో ఒకరిగా  అరుదైన అపూర్వ గౌరవం లభించిన సందర్భంగా శుభాభినందనలు. ఈ సందర్భంగా  ఈనాడు తమిళనాడు ఎడిషన్  లో ఈరోజు ప్రచురితమైన నా వార్తాకథనాన్ని ఆసక్తి ఉన్న వారికోసం  ఇక్కడ పెడుతున్నాను.





Saturday, May 14, 2011

నా హుబ్లి యాత్ర 2

                             లేఖిని గురించి చెప్పిన జ్యోతి గారికి ముందుగా నెనర్లు. అమ్మ స్పెల్లింగ్స్ చెప్తుంటే లేఖినితో ఇదంతా నేనే టైప్ చేసాను.

  హుబ్లి లో ఉండగా మురుడేశ్వర్ లోని శివాలయాన్ని దర్శించుకున్నాము. రావణాసురుడు ఆత్మలింగాన్ని సంపాదించి లంకకు తీసుకొని వెళ్తూంటే వినాయకుదు తెలివిగా లింగాన్ని కింద పెట్టేస్తాడు. కోపంతో రావణుడు పెకలించేసరికి లింగం అడుగుభాగం గోకర్ణంలో ఉండిపోతుంది. ఒక భాగం మురుడేశ్వర్ లో ఇంకొక భాగం దగ్గరలోని మరొక ప్రదేశంలో పడిపోయాయి.

గుడి  వెనుక , సముద్రం పక్కన ఉన్న హొటెల్ లో ఐదో అంతస్తులో  గది దొరికింది. .అక్కడి నుంచి  కిందికి చూస్తే  ...... అదుర్స్! మధ్యాహ్నం సముద్రం ఒడ్డుకి వెళ్ళి భలేగ ఆడుకున్నాము .కల్యాణ్ మామ ,వరలక్ష్మి అత్త , శ్రీముఖి , అమ్మ , నేను వాటర్ స్కూటింగ్ , స్పీడ్ బోటింగ్ చేశాము . ఒంటె  ఎక్కాము. నీళ్ళల్లో బా........గా  ఆడుకున్నాము  .
       సాయంత్రం  గుడికి వెళ్ళాము .కరెంటు పోయినప్పుడు చందమామ వెలుగులో అలలు ప్రాకారాన్ని తాకుతుంటే హాయిగా అనిపించింది . మరుసటి రోజు స్లైడ్ పూల్ , వేవ్ పూల్ లో  ఆడుకొని దగ్గరలోని   పెద్ద శివుడి కింద ఉన్న మ్యూజియం   చూశాము. రావణాసురుడు ఆత్మలింగాన్ని సంపాదించి పోగొట్టుకున్న కథ బొమ్మలతో అక్కడ చూపించారు. తరువాత హోటెల్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో శ్రీముఖి, నేను ఆడుకొని ట్రిప్ అయిపోయిందే అని బాధపడుతూ తిరిగి బయలుదేరాము. అక్కడి నుంచి మూకాంబిక అమ్మవారిని, గోకర్ణంలోని శివాలయాన్ని దర్శించుకొని హుబ్లీ వెళ్ళిపోయాము.

  నోట్ :   వచ్చే టపాలో పక్షిధామ గురించి చెప్తాను. ఈ క్రింది స్లైడ్ షో చూడండి.  





Sunday, April 24, 2011

నా హుబ్లీ యాత్ర - 01

అమ్మ, నేను దసరా సెలవులకి హుబ్లీ లోని మా కళ్యాణ్ మామ ఇంటికి వెళ్ళాము. అప్పుడు హుబ్లీ లోని కొన్ని చోట్లకి వెళ్ళాము. ఇంకా కర్ణాటకలో కొన్ని ప్రదేశాలు చూసాము. అవి నాకు బాగా నచ్చాయి. ముందు నృపతుంగా బెట్ట గురించి చెప్తాను. అది హుబ్లీ ఊరు చివర ఉంది. 'బెట్ట' అంటే కొండ. అమ్మ, నేను, వరలక్ష్మి అత్తా, వాళ్ళ పాప శ్రీ ముఖి, అత్త ఫ్రెండ్ రేణు అంటీ, వాళ్ళ బాబు రిషీత్ తో కలిసి అటో లో కొండపైకి వెళ్ళాము. కొండ మీద నుంచి దూరంగా ఉన్న సరస్సు కనిపించింది. ( అంతకు ముందు ఒకరోజు అక్కడ పడవలో హాయిగా తిరిగాము.) ఇంకొక వైపు పొలాలు, వాటి మధ్యలో దేవాలయాలు కనిపించాయి. తరువాత ఆటస్థలానికి వెళ్ళాము. నేను, శ్రీముఖి, రిషీత్ చీకటి పడిన తరువాత కూడా బాగా ఆడుకున్నాము.

మురుదేశ్వర్, పక్షిధామ, మూకాంబిక, రాణి చెన్నమ్మ కోట విశేషాలు తరువాత చెప్తాను.`ఆ ఫోటోలు, వీడియోలు ఈ క్రింది స్లైడ్ షో లో చూడండి.



Monday, April 4, 2011

ఉగాది శుభాకాంక్షలు

 పెద్దలకు, మిత్రులకు అందరికీ ఖరనామ ఉగాది శుభాకాంక్షలు  


Saturday, March 5, 2011

సుస్వాగతమ్


అందరికీ నమస్కారం

ఈ ' వినయ్ ' అనే వినయ దత్త మా బాబే ! 

ఈరోజుకి అతడు పుట్టి సరిగ్గా పదకొండేళ్లయింది. 

తిథుల ప్రకారం ( 2000 వ సంవత్సరం ) ఆదివారం - అమావాస్య - అర్థరాత్రి పుట్టడం వల్లనేమో కొంత విలక్షణంగా వుంటాడు. ఎప్పుడూ ఉత్సాహంగా వుంటాడు. 



ఒక సంవత్సరం కాలం నుంచి నేను ' కూడలి ' ని తరచుగా సందర్శిస్తున్నాను. ఇది గమనించిన వినయదత్తా ' ఎప్పుడూ కూడలేనా ? ఎప్పుడూ తెలుగు బ్లాగులేనా ? ' అనేవాడు. అప్పుడు నేను ' కథామంజరి ' తదితర బ్లాగుల్లోని కథలు చదివి వినిపించాను. 

' శిరాకదంబం ' లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టపా ద్వారా ఆ గాన గంధర్వుడికి శుభాకాంక్షలు అందిస్తూ మా బాబు పేరును కూడా చేర్చాను. బాలు తాతగారంటే వాడికీ ఇష్టమే మరి. మా శుభాకాంక్షలకి స్పందించిన రావుగారు ప్రత్యేకంగా రెండు మాటలు మా బాబుని ఉద్దేశించి రాశారు. అప్పటికే కథలకి ఆకర్షితుడయ్యాడు కాబట్టి ' అమ్మా ! నేను కూడా బ్లాగు రాస్తాను ' అన్నాడు. అడిగిందే తడవుగా ప్రయత్నించినా ఎందుకో మరి మొదలు పెట్టడానికే  కొంత ఆలస్యమైంది. మొత్తానికి అతడి  ఆలోచనకి, ఊహకి ఒక రూపం ఇవ్వగలుగుతున్నందుకు సంతోషంగా వుంది. 

తెలుగు చదవడం, రాయడం రాకపోయినా అతని టపాలోని మాటలు అతనివే ! పదాలు మాత్రమే నావి. ఎప్పుడో ఒకసారి మీ ముందుకు వచ్చే వినయ దత్త ను ఆశీర్వదించగలరు. ఇదే వేదికను ఉపయోగించుకుని నేనూ కొన్ని టపాలు ప్రచురించగలను.

శుభాభినందనలతో............ 

మాధురి 
ప్రాణిక్ హీలర్ 
కాంట్రిబ్యూటర్, ఈనాడు 
చెన్నై